అహ్మదాబాద్ : భారత్ ఓటమి పాలైన మొదటి , మూడో టీ20 మ్యాచ్‌లను చూస్తే ఓపెనర్ల వైఫల్యమే ప్రధానంగా కనపడుతోంది. ముఖ్యంగా జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరున్న కేఎల్ రాహల్ వరుస వైఫ్యలాలు జట్టు బలహీనతలను బయటపెడుతున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ 20లో కేవలం నాలుగు బంతుల ఆడిన రాహుల్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో రాహుల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో కెప్టెన్ కోహ్లి మాట్లాడుతూ... రాహుల్ ఛాంపియన్ ప్లేయర్ అని, బౌన్స్ బ్యాక్ అయ్యే సత్తా తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. "ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల బ్యాట్స్‌మెన్. రోహిత్‌తో పాటు అతడు కూడా భారత్ ప్రధాన బ్యాటింగ్ లైనప్‌లో తన అవసరం ఉంది’’ అని రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు.
కాగా ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లకు సునాయాసంగా తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకు రాహుల్ ఆడిన మూడు మ్యాచ్‌లలో 1,0,0 స్కోర్లను నమోదు చేశాడు. కాగా మూడో టీ20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో భారత బ్యాట్స్‌మెన్ కట్టడి చేయడంలో విజయం సాధించారు. ఫలితంగా 157 పరుగుల స్వల్స లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ బౌలర్లు శ్రమించిన బట్లర్ భీకర బ్యాటింగ్‌కు ముందు తలొంచక తప్పలేదు. మంగళవారం నాటి ఓటమితో భారత్‌కు మిగిలిన రెండు మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. ప్రధానంగా బ్యాటింగ్ టాప్ ఆర్డర్ వైఫల్యాలతో సతమతమౌతున్న భారత్‌కు సిరీస్‌ను కైవసం చేసుకోవడం పెను సవాలనే చెప్పాలి. ( చదవండి : వుడ్ బౌలింగ్‌తో... బట్లర్ బ్యాటింగ్‌తో...)
Comments
Please login to add a commentAdd a comment