Sandeep Nahar Suicide: భార్య వేధింపులు.. బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య | MS Dhoni Movie Actor Sandeep Nahar Suicide - Sakshi
Sakshi News home page

భార్య వేధింపులు.. బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య

Published Tue, Feb 16 2021 6:30 AM | Last Updated on Tue, Feb 16 2021 1:01 PM

Bollywood actor Sandeep Nahar ends life - Sakshi

ముంబై: ముంబైకి చెందిన బాలీవుడ్‌ నటుడు సందీప్‌ నహర్‌(32) ఆత్మహత్య చేసుకున్నారు. అక్షయ్‌ కుమార్‌ సినిమా కేసరి, దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ‘ఎంఎస్‌ ధోనీ’ మూవీలో సహాయ పాత్రలు పోషించిన సందీప్‌ సోమవారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌ పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే ఉరేసుకున్నారు. తన భార్య కాంచన్, అత్త రెండేళ్లుగా తీవ్ర వేధింపులు, బెదిరింపులకు గురి చేస్తున్నారని సూసైడ్‌ నోట్‌లో ఆరోపించారు. భార్యతో తనకు కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని స్పష్టం చేశారు. ఆత్మహత్యే సమస్యలకు పరిష్కారమని భావించినట్లు తెలిపారు.

‘బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో రాజకీయాలతో అసంతృప్తికి గురయ్యా. రాజకీయాల కారణంగా చేతికి వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో దూరమయ్యాయి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. గోరెగావ్‌లోని నివాసంలో నహర్‌ ఉరేసుకున్న సమయంలో భార్య కూడా ఇంట్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. విషయం గ్రహించిన వెంటనే ఆమె సందీప్‌ను రెండు ఆస్పత్రులకు తీసుకెళ్లారనీ, అయితే అప్పటికే అతడు తుదిశ్వాస విడిచారని చెప్పారు. కాగా, ఎంఎస్‌ ధోనీ సినిమాలో సందీప్‌ సహనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా 2020 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండినా భార్యను నేనే చంపేశా.. ఇక దేనికైనా సిద్ధమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement