
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్‌లో ఓ కారు అదుపుతప్పి దుకాణంలోని ముందు భాగంలోకి చొచ్చుకుపోయింది. అంతేకాకుండా దుకాణం పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆ స్తంభం విరిగిపోయింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో పాటు, అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం తెల్లవారు జామున జరగడంతో ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment