
సాక్షి, కామరెడ్డి : బిక్కనూరు మండలం లింగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. హైదరాబాద్‌ను నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. గ్యాస్ కట్టర్‌తో కారును కట్ చేసి మృతదేహాలను వెలికితీశారు. మృతులు నిజామాబాద్ జిల్లాలోని నవీపేటకు చెందినవారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment