నిమిషాల వ్యవధిలో రెండు ప్రమాదాలు, నలుగురికి తీవ్రగాయాలు
ఒకే కారు ఢీకొని ఉంటుందని గాలిస్తున్న పోలీసులు
ఆదిలాబాద్: మండలంలో నిమిషాల వ్యవధిలో జరిగిన ఇరు రోడ్డు ప్రమాదాల్లో ఓ యువకుడు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బజార్‌హత్నూర్ మండలం మాడగూడ, మోర్కండి గ్రామాలకు చెందిన తొడసం బాలాజీ, నవీన్, మేస్రం భీంరావ్‌లు బైక్‌పై ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఢీకొంది.
దీంతో సంఘటనా స్థలంలో నవీన్(22) మృతిచెందగా మిగితా ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో సీతాగోంది సమీ పంలో మరో మో టార్ సైకిల్‌పై వెళ్తు న్న మహారాష్ట్ర సమీపంలోని గోసాయి ఉండం గ్రా మానికి చెందిన బడేవాడ్ శ్రీనివాస్, అమృత్‌రావ్‌లను సైతం కారు వెనుక నుంచి ఢీకొనగా ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వీరిని అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు.
కాగా నిమిషాల వ్యవధిలో కారు ఢీకొనడంతో ఒకే కారు వీరిని ఢీకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదాలకు కారణమైన కారును పట్టుకోవడానికి ఆయా రూట్లలో ఉన్న పోలీసులకు సమాచారం అందించి గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బలిరాం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment