క్రికెట్‌లో గొడవ.. ఒంటరిగా నడిచి వెళ్తుంటే ఆపి.. | Civil Engineer Assassinated Due To Cricket Rivalry Tamil Nadu | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో గొడవ.. ఒంటరిగా నడిచి వెళ్తుంటే ఆపి..

Published Mon, Jan 3 2022 5:07 AM | Last Updated on Mon, Jan 3 2022 5:27 AM

Civil Engineer Assassinated Due To Cricket Rivalry Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఏర్పడిన గొడవల కారణంగా ఓ ఇంజినీర్‌ హత్యకు గురయ్యాడు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా హోసూర్‌ సమీపంలోని సోమపట్టికి చెందిన సివిల్‌ ఇంజినీర్‌ మోహన్‌బాబు (25). ఇతను శనివారం లేఅవుట్‌ ప్రాంతంలో జరుగుతున్న కట్టడాలను చూడడానికి నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన పవన్‌ (23), మూర్తి (20), తిలక్‌ (22), సురేష్‌ (20), అప్పు (20), హేమంత్‌ (20) అడ్డుకుని దాడికి దిగారు. ఇంతకుముందు వారి మధ్య క్రికెట్‌ గొడవ ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయం అయిన మోహన్‌ బాబును ఇరుగు పొరుగు వారు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మోహన్‌బాబు మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మరో ఘటనలో..

హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం 
నామక్కల్‌ జిల్లా పాలపట్టి గ్రామానికి చెందిన సెంథిల్‌ కుమార్‌ (37) ఈబీ కార్యాలయంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య లత. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో శనివారం సెంథిల్‌ కుమార్‌ ఆలనత్తం సమీపంలోని పుదుక్కోట్టై నుంచి దూసై వెళ్లే   మార్గంలో  సగం కాలిన స్థితిలో శవంగా పడి ఉన్నాడు. ఎరుమంమట్టి పోలీసులు అక్కడికి చేరుకుని విచారణలో అదే ప్రాంతానికి చెందిన నటేశన్‌ (38)పై అనుమానం వ్యక్తమైంది. దర్యాప్తులో నటేషన్‌ భార్య జయతో సెంథిల్‌ కుమార్‌ వివాహేత సంబంధం కొనసాగిస్తుండడంతో హత్య చేసినట్లు వెల్లడైంది. నటేషన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement