![Cop Arrested Pet Dog Thief In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/29/thi.jpg.webp?itok=B2al3wsP)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): హాసన్ సమీపంలోని హొన్నేనహళ్లి రోడ్డులోని జాగిలాల ఫారంలో విలువైన కుక్కలు చోరీకీ గురయ్యాయి. దివాకర్ అనే వ్యక్తి కుక్కల ఫారంను నడుపుతున్నాడు. ఈ నెల 18 రాత్రి రూ.లక్షన్నర విలువగల రాట్ వీలర్, ల్యాబ్రడార్, గోల్డెన్ రిట్రివర్ జాతుల 4 కుక్కలను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపాడు.
ఇంతలో తన వద్ద 4 విలువైన కుక్కలు అమ్మకానికి ఉన్నాయని హోళెనరసిపుర వాసి రోహన్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడు. అది చూసి దివాకర్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రోహన్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. డబ్బు కోసమే కుక్కలను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment