
సాక్షి, హైదరబాద్ : జియో కస్టమర్ సర్వీస్ పేరిట కొత్తరకం మోసానికి తెరతీశారు సైబర్ నేరగాళ్లు. జియో కస్టమర్లకు ఫోన్ చేసి ‘మీ సిమ బ్లాక్ అవుతుంది. వెంటనే రీఛార్జ్ చేయాలి’ అంటూ కస్టమర్ కేర్‌నుంచి ఫోన్ చేసినట్లుగా నమ్మిస్తున్నారు. రిమోట్ యాక్సె్‌స్ యాప్ ద్వారా రిఛార్జ్ చేయాలని చెబుతున్నారు. ఆ యాప్ ద్వారా కస్టమర్ల అకౌంట్లలోంచి డబ్బులు మాయం చేస్తున్నారు. ఇద్దరు మహిళలనుంచి 2.7లక్షల రూపాయలు దోచేశారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జియో కస్టమర్లు సైబర్ చీటర్స్ నుండి అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment