
సుబహాన్‌వలి
వైఎస్‌ఆర్ జిల్లా,గాలివీడు: కూతురు చనిపోయిందనే వార్త తెలియగానే గుండె పోటుతో తండ్రి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని గొట్టివీడు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఆర్వో సుభహాన్‌వలి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమార్తె మొదీనా (27)ను రాయచోటి సమీపంలోని మాసాపేటకు ఇచ్చి వివాహం చేశాడు. ఆదివారం ఉదయాన్నే మొదీనా గుండె పోటుతో మృతిచెందిందని అల్లుడి కుటుంబీకులు ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. కూతురి మరణ వార్త చెవిన పడగానే సుబహాన్‌వలి కుప్పకూలి పడిపోయి వెంటనే ప్రాణం వదిలాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మృతుడి కుటుంబీకులను ఫోన్‌లో పలుకరించి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment