
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మైసూరు (కర్ణాటక): ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి సయ్యద్ ముజీబ్ (45) అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇతడు రెండున్నర నెలల క్రితం భార్యతో విడిపోయి ముగ్గురు పిల్లల తల్లిని రెండవ వివాహం చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఆమె కూతురిపై అత్యాచారం చేశాడు. బుధవారం ఉదయం బాలిక అనారోగ్యానికి గురి కావడంతో విషయం వెలుగు చూసింది. చామరాజనగర ఇన్‌స్పెక్టర్ మహదేవశెట్టి నిందితుడిని అరెస్టు చేశారు.
లైంగికదాడి కేసులో అరెస్టు
బాగేపల్లి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ట్రాక్టర్ డ్రైవర్‌ను బాగేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గూళూరు హోబళికి చెందిన 15 ఏళ్ల విద్యార్థినిపై 21 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఫిర్యాదు రావడంతో ఇన్‌స్పెక్టర్ డీఆర్ నాగరాజు పోక్సో చట్టం కింద అరెస్టుచేసి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment