సాక్షి,నెల్లూరు: బోడిగాడితోటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పెద్ద ఎత్తున పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. మంటల్లో పలువురు అపార్ట్‌మెంట్‌వాసులు చిక్కుకున్నారు. ఒకరిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటల్లో చిక్కుకొని గాయపడిన ఇద్దరిని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పక్కన కెమికల్ గోడౌన్ ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మూడు బైక్‌లు దగ్దం అయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: టీకా తీసుకుంటే 'పాజిటివ్' రాదు
Comments
Please login to add a commentAdd a comment