
నెల్లూరు (క్రైమ్): ‘ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టుచేసి నాకు రక్షణ కల్పించిన జిల్లా పోలీసులకు రుణపడి ఉంటా’ అని విదేశీ వనిత పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మంగళవారం లిథువేనియా దేశానికి చెందిన మహిళ (27)పై ఇద్దరు యువకులు లైంగికదాడికి యత్నించడం.. ఆమె తప్పించుకుని వాహనచోదకుల సహాయంతో పోలీసుల రక్షణ పొందడం విదితమే.
బుధవారం ఆమె నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సీహెచ్ విజయారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు స్పందన చాలా బాగుందని కొనియాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఒంటరిగా అనేక దేశాలు పర్యటించినా.. ఎప్పుడు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోలేదన్నారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారని, జిల్లా ఎస్పీకి, పోలీసు అధికారులకు రుణపడి ఉంటానంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment