యువతిని దేవదాసిగా మార్చి.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు | Four Arrested For Turning Young Woman Into Devadasi Karnataka | Sakshi
Sakshi News home page

యువతిని దేవదాసిగా మార్చి.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

Published Thu, Dec 29 2022 12:30 PM | Last Updated on Thu, Dec 29 2022 12:30 PM

Four Arrested For Turning Young Woman Into Devadasi Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,బళ్లారి(కర్ణాటక): ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో దేవదాసి పద్ధతి ఇంకా కొనసాగుతోంది. తాజాగా కొప్పళ జిల్లాలో చలవాడి గ్రామంలో ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు దేవదాసిగా మార్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 8 నెలల క్రితం  గ్రామానికి చెందిన ఒక యువతిని హులిగిలోని హులిగమ్మ ఆలయంలో కాలుకు చైను, చేతికి గాజులు తొడిగి, మెడలో తాళి కట్టించి దేవదాసిగా మార్చారు.

ఈ పద్ధతిని రూపుమాపేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నా సంప్రదాయాల పేరుతో కుటుంబ సభ్యులే ఈ రకంగా చేయడంపై సంబంధిత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.
చదవండి: ప్రియురాలితో గోవా టూర్‌ కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే!   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement