
తుమకూరు: ప్రేమించలేదని అమ్మాయిని దారుణంగా పొడిచి చంపిన దుండగున్ని శిర పోలీసులు అరెస్టు చేశారు. దొడ్డగోళ గ్రామంలో కావ్య అనే పీయూసీ విద్యార్థినిని మేకల కాపరి ఈరణ్ణ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసేవాడు. తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్నాడు. సోమవారం దొడ్డగోళ గ్రామంలోని ఇంటి నుంచి శిరలో కాలేజీకి వెళుతుండగా ఈరణ్ణ బైక్‌లో వచ్చి పక్కనే ఉన్న పొలంలోకి అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. అక్కడ కత్తితో దారుణంగా ముఖం, గొంతు, చేతులపై పొడవడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. పోలీసులు గాలించి నిందితున్ని అరెస్టు చేసి బైకు, కత్తి, ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment