కామారెడ్డిలో ఆర్టీసీ బస్‌ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం | Maharashtra RTC Bus Road Accident At Kamareddy | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో ఆర్టీసీ బస్‌ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం

Published Sun, Feb 14 2021 6:45 AM | Last Updated on Sun, Feb 14 2021 8:43 AM

Maharashtra RTC Bus Road Accident At Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టేక్రియాల్ 44వ జాతీయ రహదారిపై మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement