దారుణం: ఏడేళ్లుగా అత్యాచారం.. కూతురికి గర్భం | Man Accused of Molesting Daughter For 7 Years In Haryana | Sakshi
Sakshi News home page

ఏడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి అత్యాచారం..

Published Mon, Jan 18 2021 5:28 PM | Last Updated on Mon, Jan 18 2021 7:36 PM

Man Accused of Molesting Daughter For 7 Years In Haryana - Sakshi

చంఢీగడ్‌‌‌: ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. బయటి నుంచి వచ్చే ప్రమాదాలే కాకుండా సొంత వాళ్లే అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నారు. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన అమానుష ఘటన తాజాగా హర్యానాలో చోటుచేసుకుంది. వివరాలు.. రాష్ట్రంలోని హిసార్‌ నగరంలో 17 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడుతునట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడేళ్లుగా ఆమెపై ఈ దారుణానికి ఒడిగడుతూ.. మానసికంగా, శారిరకంగా హింసించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో యువతి పలుమార్లు గర్భం రావడంతో దానిని తండ్రి బలవంతంగా తీయించినట్లు తెలిపారు. చదవండి: దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి

అంతేగాక 11 ఏళ్లు ఉన్న మరో కూతురిపై కూడా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై ఇటీవల బాధితురాలు హిసార్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు వాపోయింది. ఈ దారుణాన్ని ప్రతిఘటించినప్పుడు తనను చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి : 13 నెలల నరకం.. గర్భవతిగా ఇంటికి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement