దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను.. | Man Assassinated Uncle In Orissa | Sakshi
Sakshi News home page

దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను..

Published Sat, Feb 27 2021 2:18 PM | Last Updated on Sat, Feb 27 2021 2:18 PM

Man Assassinated Uncle In Orissa - Sakshi

నరేంద్ర సాహు మృతదేహం

భువనేశ్వర్‌ : తనపై ఎంగిలి పల్లెం విసిరాడన్న కారణంతో సొంత చిన్నాన్ననే గొంతుకోసి చంపాడో ప్రబుద్ధుడు. ఈ దుర్ఘటన సదర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లంజియా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఏదో విషయమై నరేంద్ర సాహు తన అన్నకొడుకు శిబరామ్‌ సాహుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకనొక దశలో కోపంతో ఊగిపోయిన నరేంద్ర సాహు తన దగ్గరి ఎంగిలి పల్లెం శిబరామ్‌ సాహుపైకి విసిరాడు. దీంతో కోపోద్రేకుడైన శిబరామ్‌ తన దగ్గరి కత్తితో చిన్నాన్న గొంతుకోసి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శిబరామ్‌ని అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కి తరలించారు. హత్యకి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఐఐసీ అధికారి సంతోషినీ హోరాం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement