లత(ఫైల్) - రాస్య (ఫైల్)
నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా): మేజరు పంచాయతీ నరసన్నపేట పరిధిలోని హనుమాన్‌నగర్‌లో శివరాత్రి నాడు సంచలనం సృష్టించిన తల్లీ బిడ్డ లత, రాస్యల అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తల్లీ బిడ్డలది హత్యేనని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబీకుల ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు దృష్టి సారించారు. విస్తుపోయే నిజాలు బయటపడినట్టు సమాచారం. ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళుతున్నారు? వారి దర్యాప్తు ఎలా సాగుతోంది? పోస్టుమార్టంలో ప్రాథమిక విషయాలు ఏం చెబుతున్నాయి?
ఇన్వెస్టిగేషన్..
డబుల్ మర్డర్ విషయం తెలుసుకున్న డీఎస్పీ మహేంద్ర గురువారం అర్థరాత్రి దాటిన తరువాత సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాల సేకరణ ఇతర అంశాలపై స్థానిక పోలీసులతో చర్చించారు. లోతుగా దర్యాప్తు చేయాలని సీఐ తిరుపతి, ఎస్‌ఐ సత్యనారాయణలను ఆదేశించారు.
వివాహేతర సంబంధం మోజులోనే?
►మృతురాలి తల్లి అంకమ్మ తమ అల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపించిన క్రమంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు.
►ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్‌ను స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు.
►గతంలో ఒకసారి లతను చంపేందుకు ప్రయత్నించి విఫలమైన రమేష్ ఈసారి మాత్రం ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
►శివరాత్రి సందర్భంగా గుడికి వెళ్లి అలసటతో ఇంటికి వచ్చి నిద్రపోతున్న లతను గొంతు నులిమి.. తలగడతో ముఖంపై అద్ది హత్య చేసినట్లు తెలుస్తోంది.
►భార్య మరణించిందని నిర్ధారించుకుని తర్వాత ఏడాదిన్నర కుమార్తెను కూడా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
►ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ వారికి అడ్డుగా ఉందని భావించి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల అనుమానం. ఆమెను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
పోస్టుమార్టం
►తల్లీబిడ్డల మృతదేహాలకు శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది.
►లత గొంతు భాగంలో ఎముకల విరిగినట్టు ఆనవాళ్లను గుర్తించినట్టు సమాచారం.
►విష ప్రయోగం జరగలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
►నీరు తప్ప కడుపు ఖాళీగానే ఉన్నట్టు గుర్తించారు.
►మృతురాలి తల్లి అంకమ్మ తమ అల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపించిన క్రమంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు.
►ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్‌ను స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు.
►గతంలో ఒకసారి లతను చంపేందుకు ప్రయతి్నంచి విఫలమైన రమేష్ ఈసారి మాత్రం ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
►శివరాత్రి సందర్భంగా గుడికి వెళ్లి అలసటతో ఇంటికి వచ్చి నిద్రపోతున్న లతను గొంతు నులిమి.. తలగడతో ముఖంపై అద్ది హత్య చేసినట్లు తెలుస్తోంది.
►భార్య మరణించిందని నిర్ధారించుకుని తర్వాత ఏడాదిన్నర కుమార్తెను కూడా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
►ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ వారికి అడ్డుగా ఉందని భావించి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల అనుమానం. ఆమెను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
చదవండి:
బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్ సొసైటీ’
హత్యకేసు: అనపర్తి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment