సాక్షి, మలక్‌పేట: ఆసుపత్రి ఆవరణలో ఉమ్మొద్దు అన్నందుకు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎఫ్‌ఏ)పై చేయి చేసుకోవడమే కాకుండా అతని కుమారుడిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ ఎస్‌ఎఫ్‌ఏలు, పారిశుద్ధ్య కార్మికులు కోవిడ్ వాక్సిన్ వేయించుకోవడానికి ఆదివారం శాలివాహననగర్ యూపీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకున్నారు. ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌లో పని చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఏ సుదర్శన్ కూడా వాక్సిన్ తీసుకొవడానికి అక్కడి వచ్చాడు. సుదర్శన్‌ను తీసుకెళ్లడానికి అతడి కుమారుడు దేవేందర్ ఆసుపత్రికి వచ్చాడు.
మూసారంబాగ్‌కు చెందిన పాండురావు తన ఇద్దరు కొడుకులు రమేష్, జగదీష్‌లను తీసుకొని ఆసుపత్రికి వచ్చాడు. పాండురావు ఆసుపత్రి ఆవరణలో ఉమ్మివేస్తుండగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఆసుపత్రి ఆవరణలో ఉమ్మివేయద్దొని దేవేందర్ చెప్పాడు. పాండురావు బూతులు తిడుతూ ఎక్కడ ఉమ్మి వేయాలని అతనిపై ఆగ్రహించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడంతో పక్కనే ఉన్న అతని కొడుకులు దేవేందర్‌పై దాడి చేసి కొట్టగా కుడి కన్నుపై గాయమైంది. అడ్డుకోబోయిన దేవేందర్ తండ్రి ఎస్‌ఎఫ్‌ఏ సుదర్శన్‌పై కూడా చేయి చేసుకున్నారు.
సుదర్శన్ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవేందర్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంఈయూ నాయకులు, బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ అధ్యక్షుడు ఊదరి గోపాల్, శ్రీహరి, రాము ఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. విధి నిర్వాహణలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఏపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేశారు.
చదవండి: కోవిడ్ సెకండ్ వేవ్.. కుదేలవుతున్న క్యాబ్‌లు!
Comments
Please login to add a commentAdd a comment