![Man Brutally Assassination In Nellore District - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/14/NLR3.jpg.webp?itok=WPANOzHJ)
సాక్షి, నెల్లూరు జిల్లా: చిల్లకూరు మండలం ముత్యాలం పాడులో దారుణం చోటుచేసుకుంది. మిద్దెపైన నిద్రిస్తున్న కాకు దయాకర్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు. కేకలు విన్న దయాకర్ అక్క, బావలు మిద్దెపైకి వెళ్లటంతో ముసుగులు ధరించిన దుండగులు కిందకి దూకి పారిపోయారు. దొంగతనాలకు పాల్పడి చెల్లపల్లి జైలులో శిక్ష అనుభవించి నెల రోజుల క్రితమే దయాకర్ విడుదల అయ్యాడు.
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో దయాకర్‌పై పీడీ యాక్ట్ కూడా పెట్టారు. జైలు నుంచి వచ్చిన దయాకర్ ప్రస్తుతం సోదరి ఇంట్లో ఉంటున్నాడు. ఇక్కడ దయాకర్ కి శత్రువులు ఎవరూ లేరని అతని అన్న ధనుంజయ్ చెబుతున్నాడు. దొంగతనాల్లో పార్టనర్స్ ఎవరైనా ఈ హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
దారుణ హత్య: గొంతుకోసి..కత్తులతో పొడిచి..
భర్త ఫోన్‌కాల్: భార్యను చంపేశా.. కూతుర్లను కూడా చంపేస్తా..
Comments
Please login to add a commentAdd a comment