
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హోసూరు(కర్ణాటక): క్రిష్ణగిరి జిల్లా సింగారపేట సమీపంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీబాలు (32). ఇతనికి గత 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలున్నారు. గత కొద్ది నెలల క్రితం భార్య గొడవ పడి పుట్టింటికెళ్లిపోయింది. ఈ సమయంలో అతడు 28 ఏళ్ల దివ్యాంగురాలితో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఫిబ్రవరి నుంచి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.
ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అయిన ఆమె వెంటనే పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించి హత్య చేస్తానని బెదరించాడు. బాధితురాలు సింగారపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment