ప్రతీకాత్మక చిత్రం
హిమాయత్‌నగర్: ఫ్రెండే కదా నమ్మి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు మైనర్ బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడో మైనర్ బాలుడు. సైదాబాద్‌కు చెందిన ఇంటర్మీడియట్ బాలిక ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌కు తన క్లాస్‌మేట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఫ్రెండే కదా అని యాక్సెప్ట్ చేయ్యగా.. కొద్దిరోజులుగా ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తన ఫ్రెండ్‌కు కొన్ని ఫొటోస్‌ను పంపింది.
ఆ ఫొటోలతో అతగాడు బాలిక పేరుతో ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. తనకు న్యూడ్‌గా వీడియో కాల్ చేయాలని, లేనిపక్షంలో నీ ఫొటోలన్నీంటిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగెత్తిన బాలిక అతడిపై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వాట్సాప్ డీపీతో మోసానికి యత్నం
హిమాయత్‌నగర్: కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఓ అధికారి వాట్సాప్ డీపీని తన వాట్సప్ డీపీగా పెట్టుకుని మోసాలకు పాల్పడేందుకు యత్నించాడో సైబర్ నేరగాడు. తెలిసిన వారందరికీ వాట్సాప్‌లో చాట్ చేస్తూ.. డబ్బులు అడుగుతున్నాడు. తన ఆరోగ్యం సరిగా లేదని వైద్యానికి డబ్బులు కావాలంటూ తోటి అధికారులు, సిబ్బందికి మెసేజ్‌లు చేస్తుండటంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ అధికారి శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: తల్వార్లతో నృత్యాలు: 9 మంది రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment