
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐమాక్స్ సినిమా థియేటర్ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖైరతాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖైరతాబాద్‌కు చెందిన భాస్కర్(52) అనే వ్యక్తి ఐమాక్స్ సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం సగం జీతం మాత్రమే ఇచ్చింది.
అంతేకాకుండా వచ్చే నెల నుంచి జీతం ఇవ్వటం కుదరదని చెప్పటంతో మనోవేదనకు గురైన ఆయన నివాసంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (పబ్‌జీ బ్యాన్.. బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment