
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు : నేర నేపథ్యం కలిగిన ప్రియుడితో పారిపోయిన వివాహిత, భర్తను జైలుకు పంపించాలనే పథకం బెడిసికొట్టి చివరికి అడ్డంగా దొరికిపోయింది. వివరాలు... వైట్‌ఫీల్డ్‌కు చెందిన కారు డ్రైవర్ (32)తో ఎనిమిదేళ్ల క్రితం ఓ యువతికి వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం కుటుంబ సలహా కేంద్రానికి సదరు మహిళ ఫోన్ చేసి తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా చీటీలు నడుపుతున్నాడని, వ్యతిరేకించినందుకు తనను ఇంటి నుంచి గెంటివేశాడని పేర్కొంది. దీంతో కుటుంబ సలహా కేంద్రం సభ్యులు అపర్ణ పూర్ణేశ్ ఆమె భర్త ఫోన్ నెంబర్ తీసుకుని విచారణ చేయగా సదరు మహిళ అసలు రంగు బయటపడింది. (వైరల్: వాట్సప్ గ్రూప్‌లోకి అశ్లీల చిత్రాలు)
ప్రియుడితో కాపురం :
కొద్ది నెలల క్రితం సదరు మహిళ స్నేహితులతో విహార యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో వారితో వచ్చిన ఓ యువకుడి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు తరచూ ఫోన్ల ద్వారా మాట్లాడుకునేవారు. స్నేహం ప్రేమగా మారింది. పది రోజుల క్రితం సదరు యువతి ఇల్లు వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అత్తిబెళలో మరో వ్యక్తితో ఉన్నట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన కుటుంబ సలహా కేంద్ర సభ్యురాలు అపర్ణ ఆ యువతిని తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. తప్పుడు ఫిర్యాదులో భర్తను జైలుకు పంపాలని తానే కట్టుకథ అల్లానని యువతి విచారణలో చెప్పినట్లు అపర్ణ తెలిపారు. ప్రస్తుతం భర్త ఆమెతో కాపురం చేయడానికి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య సయోధ్యకు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment