సాక్షి, తిరుపతి క్రైమ్: ‘‘నాయనా! తప్పు చేసినాను..మళ్లీ ఇంటికి రావాలంటే ఏదోలా ఉంది..నన్నెవరూ క్షమించరు..పిలకాయలతో ఓసారి మాట్లాడించు నాయనా..మీకు నా ముఖం చూపలేక సచ్చిపోతున్నాను.’’ అని ఫోన్‌లో చెప్పి ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ గురువారం మరణించింది. ఈస్ట్ ఎస్‌ఐ జయచంద్ర కథనం...శ్రీకాళహస్తికి చెందిన సురేష్ కుమార్తె చెంచమ్మ (27)కు పాపానాయుడుపేటకు చెందిన వ్యక్తితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చెంచమ్మ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకున్న ఆమె భర్త, తల్లిదండ్రులు ఎన్నోసార్లు మందలించినా తీరు మారలేదు. ఈ నేపథ్యంలో చెంచమ్మ గత నెల 11న తన ప్రియుడితో కలిసి జంప్ అయ్యింది. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..)
ఎక్కడెక్కడో తిరిగి ఈ నెల 1న వారిద్దరూ తిరుపతికి చేరుకున్నారు. ఆమె ప్రియుడు మాత్రం నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే చెంచమ్మ మాత్రం ఇంటికి వెళ్లేందుకు జంకి, అదే రోజు సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి తండ్రికి ఫోన్ చేసింది. తన పిల్లలతో ఒకసారి మాట్లాడించాలని కోరింది. తాను విషం తాగానని, చనిపోతున్నానని చెప్పి ఉన్నఫళాన పడిపోయింది. స్థానికులు గమనించి 108లో ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చెందిన ఆమె తండ్రి తిరిగి ఫోన్ చేయడంతో స్థానికులు జరిగిన విషయాన్ని తెలిపారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చెంచమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...)
Comments
Please login to add a commentAdd a comment