కాశీబుగ్గ: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిపాటు సహాజీవనం చేసి ఆ తరువాత తప్పించుకు తిరుగుతున్న యువకుడిపై ఓ యువతి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామానికి చెందిన యువతికి నందిగాం మండలం రౌతుపురం గ్రామానికి చెందిన నొక్కు చిన్నారావుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
పెళ్లి కూడా చేసుకుంటానని యువకుడు నమ్మించడంతో నిజమని నమ్మిన ఆమె చిన్నారావుతో ఏడాదిగా పలాస మండలం కిష్టుపురం గ్రామంలో ఉంటున్నారు. అయితే ఇటీవల పెళ్లి ప్రస్తావన తేవడంతో చిన్నారావు దానికి అంగీకరించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment