
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సుల్తాన్‌బజార్(హైదరాబాద్): ప్రియుడు మోసం చేశాడని అక్టోబర్ 18న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రానికి చెందిన గిరిజన యువతి ఈగం మౌనికకు న్యాయం చేయాలని పోరాడుతున్న తనపై అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో బెల్లంపల్లి సీఐ జగదీష్, నెన్నెల ఎస్‌ఐ రమాకాంత్ తన ఇంటికి వచ్చి వేధింపులకు గురిచేస్తున్నారని మైలారం గ్రామ ఉపసర్పంచ్ జంబి శ్రీనివాస్ ఆరోపించారు.
గురువారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలీసులతో తన ప్రాణానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వేధిస్తున్న పోలీసులపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment