Delhi Rape Case : Priest Assaulted Victim In The Past Too, Says Chargesheet - Sakshi
Sakshi News home page

ఆ పాప ఊపిరాడక చనిపోయింది

Published Thu, Sep 23 2021 5:07 AM | Last Updated on Thu, Sep 23 2021 12:01 PM

Priest Assaulted Victim in the Past Too, Says Chargesheet - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని కంటోన్మెంట్‌కు చెందిన తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు బుధవారం అభియోగాలు నమోదు చేశారు. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు ఊపిరాడక చనిపోయిందని కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పూజారి రాధేశ్యామ్‌ ఆ బాలికపై గతంలోనూ అత్యాచారానికి పాల్పడ్డాడని తమ విచారణలో తేలినట్టుగా పోలీసులు వెల్లడించారు.

శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కూలర్‌లో మంచినీళ్లు తాగడానికి వచి్చన ఆ బాలిక అరవకుండా గట్టిగా  నోరు నొక్కి పెట్టి ఉంచిన పూజారి రాధే శ్యామ్‌ ఆమెపై బలవంతంగా అత్యాచారం జరపాడని, దీంతో ఊపిరాడక ఆ బాలిక మరణించిందని పోలీసులు చార్జిషీటులో వివరించారు.  ఎలక్ట్రిక్‌ షాక్‌ తగలడం వల్లే ఆ బాలిక మరణించిందని అతడు ఆమె తల్లిదండ్రుల్ని మభ్య పెట్టాలని చూశాడని, ఆ పాపకి విద్యుతాఘాతం తగిలినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement