Charge sheet fileds
-
ఆ పాప ఊపిరాడక చనిపోయింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని కంటోన్మెంట్‌కు చెందిన తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు బుధవారం అభియోగాలు నమోదు చేశారు. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు ఊపిరాడక చనిపోయిందని కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పూజారి రాధేశ్యామ్ ఆ బాలికపై గతంలోనూ అత్యాచారానికి పాల్పడ్డాడని తమ విచారణలో తేలినట్టుగా పోలీసులు వెల్లడించారు. శ్మశాన వాటిక సమీపంలో ఉన్న కూలర్లో మంచినీళ్లు తాగడానికి వచి్చన ఆ బాలిక అరవకుండా గట్టిగా నోరు నొక్కి పెట్టి ఉంచిన పూజారి రాధే శ్యామ్ ఆమెపై బలవంతంగా అత్యాచారం జరపాడని, దీంతో ఊపిరాడక ఆ బాలిక మరణించిందని పోలీసులు చార్జిషీటులో వివరించారు. ఎలక్ట్రిక్ షాక్ తగలడం వల్లే ఆ బాలిక మరణించిందని అతడు ఆమె తల్లిదండ్రుల్ని మభ్య పెట్టాలని చూశాడని, ఆ పాపకి విద్యుతాఘాతం తగిలినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. -
వామన్‌రావు దంపతుల హత్య కేసు: చార్జిషీట్లో ఏముంది?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/మంథని: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో చార్జిషీట్‌ను పోలీ సులు బుధవారం ఆన్లైన్లో కోర్టుకు పంపినట్లు తెలిసింది. 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉండగా.. బుధవారంతో గడువు ముగియడంతో ఆన్లైన్ ద్వారా సాఫ్ట్‌కాపీలను అప్లోడ్ చేశారు. చార్జిషీట్ కాగితపు ప్రతులను గురువారం మంథని కోర్టులో అందజేసే అవకాశం ఉంది. చార్జిషీటులో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపారనేది తెలియాల్సి ఉంది. కేసు నేపథ్యం: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిలను ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో ప్రధాన రహదారిపైనే కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. తమపై దాడి చేసింది కుంట శ్రీను అని తీవ్రంగా గాయపడ్డ వామన్‌రావు చెప్పిన వీడియా టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్‌లను 19న మంథని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను కస్డడీలో విచారించగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరు తెరపైకి వచ్చింది. తమకు కత్తులు, కారు ఇచ్చి హత్యకు సహకరించింది బిట్టు శ్రీను అని వెల్లడించారు. దీంతో బిట్టు శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దర్యాప్తును కూడా స్వయంగా పర్యవేక్షిస్తోంది. తెరపైకి జడ్పీ చైర్మన్ హత్యలపై మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు దంపతులను విచారించాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. తనను అరెస్టు చేస్తారనే అనుమానంతో పుట్ట మధు కొద్ది రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారం తర్వాత పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మూడు రోజులపాటు విచారించి వదిలి పెట్టడంతో మధు పాత్రపై పోలీసులు ఏం తేల్చారనే విషయం తెలియాల్సి ఉంది. మధు దంపతులతోపాటు కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, మరికొందరు అనుమానితులను సైతం పోలీసులు విచారించారు. దీంతో చార్జిషీట్లో ఏయే విషయాలు పొందుపరిచారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. -
పీఎంసీ బ్యాంక్ స్కాంపై 32 వేల పేజీల చార్జిషీట్
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ స్కాంకు సంబంధించి ఐదుగురు నిందితులపై 32 వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జిషీట్లో ఆ బ్యాంకు మాజీ ఎండీ జాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యమ్ సింగ్, మాజీ డైరక్టర్ సుర్జిత్ సింగ్ ఆరోరాతో పాటు, హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్) ప్రమోటర్లు రాకేశ్ వర్ధమాన్, సారంగ్ వర్ధమాన్ నిందితులుగా పేర్కొన్నారు. మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించడానికి సంబంధించి ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఐదుగురితో పాటు పోలీసులు మరో ఏడుగురు బ్యాంకు అధికారులను కూడా అరెస్టు చేశారు. వీరిపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. కాగా ఈ 32 వేల పేజీల చార్జిషీట్లో పీఎంసీ బ్యాంక్ ఫోరెన్సిక్ అడిట్ రిపోర్టు, బ్యాంకు సొమ్ముతో నిందితుల కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాదారులతో పాటు 340 మంది సాక్షుల వాంగ్మూలాలు తదితర వివరాలు ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. -
జకీర్ నాయక్‌పై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌పై ఈసీ తొలిసారిగా నేరుగా అభియోగపత్రం దాఖలుచేసింది. రూ. 193 కోట్ల నల్లధనాన్ని జకీర్ నాయక్ అక్రమంగా రవాణా చేశారనీ, అలాగే భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ అక్రమంగా స్థిరాస్తులను సంపాదించారని జకీర్ నాయక్‌పై ఈడీ అభియోగాలు మోపింది. అలాగే నాయక్ చేసిన పలు ద్వేష ప్రసంగాల వల్ల అనేకమంది ముస్లిం యవకులు చట్టవ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటం, ఉగ్రవాదులుగా మారడం జరిగిందని ఈడీ పేర్కొంది. జకీర్ ఆలోచనల వల్ల సమాజంలోని వివిధ మతాల ప్రజల మధ్య సామరస్యం దెబ్బతిన్నదనీ, వారి మధ్య విద్వేషం రగిలిందని ఈడీ తెలిపింది. -
షమీకి మరో షాకిచ్చిన భార్య
-
‘జేఎన్‌యూ’ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి దేశద్రోహం కేసులో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతర నిందితులపై ఢిల్లీ పోలీసులు సోమవారం అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేశారు. కన్హయ్యతోపాటు జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలపై దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగాలను పోలీసులు మోపారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన అఫ్జల్ గురు వర్ధంతిని జేఎన్‌యూ క్యాంపస్‌లో 2016 ఫిబ్రవరి 9న కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులు నిర్వహించడంతో వారిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే మూడేళ్ల తర్వాత పోలీసుల చేత బీజేపీ ఈ పని చేయిస్తోందని నిందితులు, ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా, అభియోగపత్రంలో కశ్మీరీ విద్యార్థులు అఖీబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, రయీయా రసూల్, బషీర్ భట్, బషరత్‌ల పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 36 మందిలో సీపీఐ నేత డి. రాజా కూతురు అపరాజిత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, బానోజ్యోత్స్న లాహిరి, రమా నాగ తదితరులున్నారు. బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిశీలించనుంది. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫుటేజీతోపాటు పలు పత్రాలను కూడా పోలీసులు అభియోగపత్రంతోపాటు కోర్టుకు సమర్పించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసేలా కన్హయ్య కుమారే అక్కడున్న గుంపును రెచ్చగొట్టాడని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితమే: కన్హయ్య ఇన్నాళ్ల తర్వాత చార్జిషీట్ వేయడం తమకు మంచిదేననీ, కేసు విచారణ పూర్తయితే నిజానిజాలు ఏంటో బయటకొస్తాయని కన్హయ్య అన్నారు. సీపీఐ నేత డి. రాజా మట్లాడుతూ రాజకీయ కారణాలతోనే ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేస్తున్నారనీ, దీనిపై తాము కోర్టులోనూ, కోర్టు బయట రాజకీయంగానూ పోరాడతామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తోందని కేసులో మరో నిందితుడు ఉమర్ ఖలీద్ ఆరోపించారు. షెహ్లా రషీద్ మాట్లాడుతూ ఇది నకిలీ కేసు అనీ, నిందితులందరూ నిర్దోషులుగా కేసు నుంచి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో ఏం జరిగిందంటే.. ఫిబ్రవరి 9: పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి రోజున అతనిని పొగుడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో ర్యాలీ ఫిబ్రవరి 10: దీనిపై క్రమశిక్షణా విచారణకు జేఎన్‌యూ యంత్రాంగం ఆదేశం. ఫిబ్రవరి 11: బీజేపీ ఎంపీ మహేశ్ గిరి, ఆరెస్సెస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరి 12: కన్హయ్య కుమార్ అరెస్ట్.. భారీ ఆందోళనలకు దిగిన విద్యార్థులు ఫిబ్రవరి 15: కన్హయ్య కేసు విచారణకు ముందు పాటియాలా హౌస్ కోర్టులో విద్యార్థులు, పాత్రికేయులు, అధ్యాపకులను దేశ వ్యతిరేకులుగా పేర్కొంటూ న్యాయవాదుల దాడి. ఫిబ్రవరి 25: తీహార్ జైలుకు కన్హయ్యను పంపిన కోర్టు మార్చి 3: కన్హయ్యకు ఆరు నెలల బెయిలు ఆగస్టు 26: కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్లకు సాధారణ బెయిలు 2019 జనవరి 14: కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు -
ఇస్రో మాజీ చైర్మన్‌పై చార్జ్‌షీట్
‘యాంత్రిక్స్-దేవాస్’ కేసులో నాయర్‌తో పాటు పలువురి పేర్లు కేబినెట్‌తో పాటు అంతరిక్ష కమిషన్‌ను మోసగించారన్న సీబీఐ న్యూఢిల్లీ: యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై గురువారం సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రైవేట్ మల్టీమీడియా కంపెనీ దేవాస్‌కు ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ రూ. 578 కోట్ల మేర అక్రమంగా లబ్ధి చే కూర్చినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నాయర్‌తో పాటు అప్పటి యాంత్రిక్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.ఆర్.శ్రీధర్ మూర్తి, దేవాస్ సీఈవో రామచంద్ర విశ్వనాథన్(ఫోర్జ్ అడ్వైజర్స్ మాజీ ఎండీ), దేవాస్ డెరైక్టర్ ఎం.జి.చంద్రశేఖర్‌ల పేర్లను అభియోగ పత్రంలో చేర్చారు. ఢిల్లీలోని సంబంధిత కోర్టులో సమర్పించిన ఈ చార్జ్‌షీట్‌లో అంతరిక్ష విభాగం అదనపు కార్యదర్శి వీనా ఎస్ రావు, ఇస్రో అప్పటి డెరై క్టర్ ఎ.భాస్కర్ నారాయణరావు, దేవాస్కి చెందిన ఇద్దరు డెరైక్టర్లు డి.వేణుగోపాల్, ఎం.ఉమేశ్ పేర్లనూ పేర్కొన్నారు. మోసానికి పాల్పడినందుకు ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, అధికార దుర్వినియోగంతో తమకు, ఇతరులకు అక్రమ లబ్ధి చేకూరేలా వ్యవహరించినందుకు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు ఆరోపించింది. జీశాట్-6, జీశాట్-6ఏ ఉపగ్రహాలు, భారత భూ భాగంలోని వ్యవస్థల ద్వారా ఎస్-బ్యాండ్ సాయంతో మొబైల్ ఫోన్లకు వీడియోలు, మల్టీమీడియా వివరాలు, సమాచార సేవల్ని పంపేందుకు దేవాస్‌ను అనుమతించేలా అధికార దుర్వినియోగం చేశారంది. వివరాల్ని తొక్కిపెట్టారు: ఎస్-బ్యాండ్ తరంగాలు కావాలంటూ రక్షణ, టెలికం శాఖలు కోరాయన్న అంశాలపై విచారణ కొనసాగుతుందని సీబీఐ తెలిపింది. ‘మే, 26 2005న అంతరిక్ష కమిషన్ 104వ సమావేశంలో జీశాట్-6/ఇన్సాట్-4ఈ కోసం రూ.269 కోట్ల బడ్జెట్ సాయం చేయాల్సిందిగా ఇస్రో కోరింది. అప్పటికే దేవాస్‌తో ఒప్పందం చేసుకున్నా ఆ విషయాన్ని వెల్లడించలేదు. నవంబర్ 17, 2005న జీశాట్-6 నిర్మాణం కోసం కేబినెట్‌కు నోట్ సమర్పించారు. ఒప్పందంపై కేబినెట్‌కు తప్పుడు సమాచారమిచ్చారు. డిసెంబర్, 2005న కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని పేర్కొంది. ఒప్పందాన్ని యాంత్రిక్స్ రద్దు చేసుకోవడంపై అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో కేసును భారత్ ఓడిపోయిన నెల తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం. కేసు ఓటమితో పరిహారం కింద దేవాస్ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దేని ఆధారంగా దాఖలు చేశారు?: నాయర్ ఏ ఆధారంగా కేసు దాఖలు చేశారో నిజానికి తనకు అర్థంకావడం లేదని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. ‘ఈ అంశంపై ఇంతకుముందు చతుర్వేది, ప్రత్యూష్ సిన్హా కమిటీలు విచారించి.. ప్రభుత్వానికి నష్టం జరగలేదని నిర్ధారణకు వచ్చాయి. అయినా సరే ఆ సమయంలో నలుగురు శాస్త్రవేత్తల్ని శిక్షించారు. నాలుగేళ్ల అనంతరం అదే అంశంపై కోర్టులో కేసు ఎలా దాఖలు చేస్తారో అర్థంకావ డం లేదు’ అని అన్నారు.