ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: వందల ఏళ్ల క్రితం బాల్య వివాహాలు, ముసలివాళ్లు బాలికను వివాహం చేసుకోవడం వంటి దారుణాలు జరిగేవి. ప్రస్తుతం ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అడపాతడపా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా మానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 7 మైనర్ బాలికను మధ్య వయస్కుడైన 38 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం... ఏడు సంవత్సరాల వయసున్న బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తి కొనుగోలు చేసి ఆపై వివాహం చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు బృందంగా ఏర్పడి బాలిక ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. అయితే వాళ్లు ఊరి బయట నిర్జన ప్రదేశంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించగానే మెహెందీ చేతులకు పూసుకుని, పాదాల మీద పారణి పూసుకుని అమాయకత్వంతో ఆ బాలిక ఆడుకుంటూ కనిపించింది.
పోలీసులు బాలికను విచారించే ప్రయత్నం చేసినా ఆమె ఏమీ చెప్పలేకపోయింది. నిందితుడిని విచారించగా 4.50 లక్షలు ఆమె తండ్రికి చెల్లించి బాలికను కొనుగోలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారు, ఎంత మంది ప్రమేయం ఉందనే దానిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment