గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి | Road Accident In Gachibowli At Hyderabad | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

Published Sun, Dec 13 2020 6:57 AM | Last Updated on Sun, Dec 13 2020 10:41 AM

Road Accident In Gachibowli At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీస్తున్నారు. మృత దేహాలను స్వాధీనం చెసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు, కారు సిగ్నల్‌ జంప్‌ చేయడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement