gachi bowli
-
Hyderabad: జర్నీ ఆఫ్ రిథమ్స్! ఈ నెల 31న ప్రత్యేక నాట్యప్రదర్శన..
సాక్షి, సిటీబ్యూరో: ‘అది ఒక రైల్వేస్టేషన్... పదహారు మంది నాట్యకారిణులు అందరూ ఒకే తరహా దుస్తులు, లగేజ్ ట్రాలీలతో ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్నారు. రైలు ఎప్పుడు వస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు ఆలస్యంగా వస్తుందని తెలవడంతో తమ పర్యటనలో భాగంగా ఏయే నగరాలను సందర్శించాలో చర్చించుకుంటున్నారు. ఆయా నగరాల్లో ప్రసిద్ధి చెందిన సంగీత రీతుల్లో భరతనాట్య ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు..’ ఇంతకీ ఇది ఏ రైల్వేస్టేషన్లో జరిగిందనేకదా.. మీ అనుమానం!ఇది నిజంగా జరగలేదు కానీ.. ఇలాంటి థీమ్‌తో ఓ నాట్యప్రదర్శన ఈ నెల 31న సాయంత్రం 6.30 గంటలకు నగరంలోని గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరగనుంది. భరతనాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని దేశంలోని ముఖ్యమైన 16 సంగీత రీతులను ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. శివాన్‡్ష మ్యూజిక్ అకాడమీ, తత్వ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దాదాపు 1.45 గంటలపాటు ఈ నాట్య ప్రదర్శన నాన్‌స్టాప్‌గా సాగనుంది. ఈ ప్రయోగం కోసం 6 నెలలపాటు శ్రమించినట్లు శివాన్‡్ష అకాడమీ నిర్వాహకురాలు, భరతనాట్య కళాకారిణి మైత్రీరావు చెప్పారు. ‘జర్నీ ఆఫ్ రిథమ్స్’ పేరిట సాగే ఈ నాట్య ప్రదర్శనకు ప్రముఖ రంగస్థల నటి, కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలు పద్మశ్రీ మంజమ్మ జోగతి హాజరుకానున్నారు. -
'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్ నూతన షావోమీ 14 సీవీ మోడల్‌ను ఆవిష్కరించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్తో పాటు పలువురు ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!! -
గచ్చిబౌలి... మూడేళ్లలో 33 శాతం పైకి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగుదలలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతం ముందుంది. ఇక్కడ గడిచిన మూడేళ్లలో ఇళ్ల ధరలు 33 శాతం పెరిగాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లోనూ ఇళ్ల ధరలు ఇదే కాలంలో 13–33 శాతం మధ్య పెరగడం గమనార్హం. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. గచ్చిబౌలిలో 2023 అక్టోబర్ నాటికి ఇళ్ల ధర చదరపు అడుగుకు (సగటున) రూ.6,355కు చేరింది. 2020 అక్టోబర్ నాటికి ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,790గా ఉండేది. ఇక కొండాపూర్లోనూ చదరపు అడుగుకు ధర 31 శాతం పెరిగి, రూ.4,650 నుంచి రూ.6,090కు చేరింది. సౌకర్యవంతమైన, విశాలమైన ఇళ్లను ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ మార్కెట్ వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. 🏘️బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 29 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,325కు చేరాయి. 🏘️ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధరలు సగటున చదరపు అడుగుకు 13–27 శాతం మధ్య గత మూడేళ్లలో పెరిగాయి. 🏘️ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో మాత్రం 27 శాతం ధరలు ఎగిశాయి. ఎంఎంఆర్‌లో లోయర్ పరేల్‌లో 21 శాతం మేర పెరిగాయి. 🏘️బెంగళూరులోని తానిసంద్ర మెయిన్రోడ్లో 27 శాతం, సార్జాపూర్ రోడ్లో 26 శాతం చొప్పున ధరలకు రెక్కలొచ్చాయి. 🏘️పుణెలో ఐటీ కంపెనీలకు కేంద్రాలైన వాఘోలిలో 25 శాతం, హింజేవాడిలో 22 శాత, వాకాడ్‌లో 19 శాతం చొప్పున ధరలు పెరిగాయి. 🏘️ముంబైలోని లోయర్ పరేల్, అంధేరి, వర్లి టాప్–3 మైక్రో మార్కెట్లుగా ఉన్నాయి. ఇక్కడ ధరలు 21 శాతం, 19 శాతం, 13 శాతం చొప్పున అధికమయ్యాయి. బలమైన డిమాండ్.. ‘‘బలమైన డిమాండ్‌కు తోడు, నిర్మాణంలో వినియోగించే మెటీరియల్స్ ధరలు ఎగియడం వల్ల దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో సూక్ష్మ మార్కెట్లలో ఇళ్ల ధరలు పెరిగాయి’’అని అనరాక్ రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ముడి సరుకుల ధలు, నిర్మాణ వ్యయాలు పెరగడం, భూముల ధరలు పెరుగుదల, డిమాండ్ అధికం కావడం వంటివి ఇళ్ల ధరల వృద్ధికి దారితీసినట్టు సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) సహ వ్యవస్థాపకుడు, ఎండీ రవి అగర్వాల్ పేర్కొన్నారు. -
ఫ్లై ఓవర్ పై.. అదుపుతప్పిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. తీవ్ర విషాదం!
హైదరాబాద్: మితి మీరిన వేగంతో ఫ్లై ఓవర్ రెయిలింగ్‌ను ఢీ కొట్టి కింద పడటంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, కల్వాల గ్రామానికి చెందిన విగ్నేష్(24) శ్రీరాంనగర్‌లో ఉంటూ డ్రైవింగ్ యాప్‌లో రైడర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అతను తన స్నేహితుడు మనీష్‌కు తెలియకుండా అతడి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని బయటికి వచ్చాడు. కొండాపూర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతుండగా అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పి కుడివైపు రెయిలింగ్‌ను ఢీ కొట్టి ఆగిపోగా విగ్నేష్ ఎగిరి బొటానికల్ గార్డెన్ జంక్షన్లో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. విగ్నేష్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: నేడు డబ్ల్యూడబ్ల్యూఈ పోరు
హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగే ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. 16 సార్లు ప్రపంచ చాంపియన్, రెజ్లింగ్ ఆల్‌టైమ్ గ్రేట్ జాన్ సినా ఇక్కడ బరిలోకి దిగనుండటమే అందుకు కారణం. అతని ఫైట్ చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎగబడటంతో చాలా ముందుగానే ‘బుక్ మై షో’లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. జాన్ సినా భారత్‌లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. 2017లో భారత్‌లో చివరిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ జరగ్గా.. ఆరేళ్ల తర్వాత మన దేశంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా రెజ్లింగ్ ఫ్యాన్స్ ఈ ఫైట్‌ను తిలకించేందుకు వస్తున్నారు. ‘సూపర్ స్టార్ స్పెక్టకిల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫైట్‌లో జాన్ సినాతో పాటు పలువురు ప్రముఖ రెజ్లర్లు పాల్గొంటున్నారు. ఫిన్ బాలర్, రియా రిప్లీ, సేట్ రోలిన్స్ ఈ జాబితాలో ఉన్నారు. టీమ్ ఈవెంట్లో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ రోలిన్స్‌తో కలిసి జాన్ సినా.. గియోవానీ విన్సీ, లుడ్విగ్ కై సర్ద్ జోడీతో తలపడతారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ రియా రిప్లీ ప్రధాన ఆకర్షణ కానుంది. రాత్రి 7.30నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైట్‌ను ‘సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
గచ్చిబౌలి లో సందడి చేసిన సినీ నటి సంయుక్త మీనన్ (ఫోటోలు)
-
Hyderabad: గురుకుల కాలేజీలో దారుణం
గచ్చిబౌలి/ హైదరాబాద్: గాఢనిద్రలో ఉన్న ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన ఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో ఈనెల 25న సాయంత్రం అల్పాహారం వడ్డించే సమయంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్ (16) లైన్లో ఉన్నాడు. రెండో సంవత్సరం విద్యార్థి సేమియా వడ్డిస్తుండగా సాత్విక్ చేతిపై పడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వడ్డించిన విద్యార్థి.. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పగా, అతడు సాత్విక్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో టీచర్లు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత.. రాత్రి హాస్టల్లో నిద్రపోయిన సాత్విక్ 1.30 సమయంలో గొంతు వద్ద నొప్పిగా అనిపించి, నిద్రలేవగా గొంతు భాగంలో రక్తం రావడం గమనించి స్నేహితులకు చెప్పాడు. గొంతు వద్ద రక్తస్రావం అవుతుండటంతో వెంటనే గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు 18 కుట్లు పడ్డాయి. ప్రాణాపాయం లేదని, విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనపై చేయిచేసుకున్న విద్యార్థే దాడిచేసి ఉంటాడని గచ్చిబౌలి పోలీసులకు సాత్విక్ ఫిర్యాదు చేశాడు. కాగా, బ్లేడ్‌తో అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అనుమానిత విద్యార్థిని పోలీసులు విచారించి సొంత పూచీకత్తుపై పంపించినట్లు తెలిసింది. తమ కొడుకును కేసులో ఇరికిస్తున్నారని అనుమానితుని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యాక్షేత్రంలో కలకలం.. గ్రామీణ పేద విద్యార్థులకు ఉత్తమవిద్య అందిస్తూ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల అగ్రభాగంలో ఉంది. ఇదే కళాశాలలో ఫిబ్రవరి 19న ఇంటర్ విద్యార్థి వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా సాత్విక్‌పై దాడి జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత భార్యను.. -
అంతు చిక్కని అస్వస్థత
సాక్షి, గచ్చిబౌలి: హైటెక్ సిటీలోని వడ్డెర బస్తీకి అంతు చిక్కని అస్వస్థత చుట్టుముట్టింది. పదులు సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఒకరు తేరుకోక ముందే మరో ముగ్గురు అన్నట్లుగా కొనసాగుతోంది వడ్డెర బస్తీలోని అస్వస్థత కేసుల సంఖ్య. మొదటి రోజు 20 మంది ఉన్న బాధితులు రెండో రోజు 51కి చేరింది. మూడో రోజుకు 76కు చేరడం అందరినీ కలవర పెడుతోంది. కలుషిత మంచి నీరు కారణమని చెబుతుండటంతో ఇప్పటికే నీటి శాంపిల్స్ సేకరించిన వాటర్ వర్క్స్ అధికారులు శనివారం మళ్లీ శాంపిల్స్ సేకరించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారయణ వడ్డెర బస్తీని సందర్శించి తాగునీటిని పరిశీలించారు. గాంధీకి అయిదుగురి తరలింపు కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అయిదుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురై విరేచనాలు, వాంతులతో బాధపడుతున్న వారిలో కిడ్నీ సమస్యలు ఉండటంతో శుక్రవారం ముగ్గురికి, శనివారం ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించామని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదా చారి తెలిపారు. నీటి నమూనాల సేకరణ వడ్డెర బస్తీలో జనం అస్వస్థకు గురైన వెంటనే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు 40 ఇళ్లలో శాంపిల్స్ సేకరించారు. థర్డ్ పార్టీ పరీక్షలు నిర్వహించిందని ఎలాంటి కలుషితం లేదని చెప్పినట్లు వాటర్‌వర్క్స్ జీఎం రాజశేఖర్ తెలిపారు. మరో రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. కలుషితమే కారణమంటున్నారు మంచి నీరు, ఆహరం, గాలి కలుషితం కారణంగానే విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, జ్వరం వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మంచి నీటిలో మురుగు నీరు సరఫరా జరిగిందని, కలుషిత నీటి కారణంగానే అస్వస్థత చోటు చేసుకుందని వడ్డెర బస్తీ వాసులు పేర్కొంటున్నారు. (చదవండి: భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు) -
మద్యం సేవించడం...ఆ పై ర్యాష్ డ్రైవింగ్
-
స్నేహమా.. కన్నీరే మిగిల్చావా!
సాక్షి, గచ్చిబౌలి: మద్యం మత్తు...అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. స్నేహితుల దినోత్సవం రోజున సరదాగా పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా...కారు అదుపుతప్పి నాలుగు పల్టీలు కొట్టడంతో ఓ యువతి దుర్మరణం పాలైంది. కొండాపూర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం...తెల్లాపూర్‌లోని బోన్సాయ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 520లో నివాసం ఉండే డి.వినయ్ కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె డి.అశ్రిత (23) కెనడాలో ఎం.టెక్ పూర్తి చేసింది. ఇటీవలే ఇండియాకు వచ్చింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో స్నేహితులైన తరుణి, సాయిప్రకాష్, అభిషేక్‌లతో కలిసి ఆమె మాదాపూర్‌లోని స్నార్ట్ పబ్‌కు స్కోడా కారులో వెళ్లారు. అక్కడే మరికొంత మంది మిత్రులూ కలిశారు. రాత్రి 11 గంటల వరకు అక్కడే గడిపారు. అనంతరం స్కోడా కారులో అభిషేక్ డ్రైవింగ్ చేయగా..సాయిప్రకాశ్ ముందు సీట్లో, అశ్రిత, తరుణిలు వెనుక సీట్లో కూర్చున్నారు. వీరు పబ్‌లో మద్యం సేవించారు. ఈక్రమంలో వీరి కారు హఫీజ్‌పేట్ ఆర్వోబీ నుంచి మదీనాగూడకు వెళుతుండగా..రాత్రి 11.30 గంటల సమయంలో కొండాపూర్‌లోని మై హోం మంగళ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రాళ్లను ఢీ కొట్టింది. నాలుగు పల్టీలు కొట్టడంతో వెనక డోర్ తెరుచుకుని.వెనక సీట్లో ఉన్న అశ్రిత కింద పడటంతో తలకు, తరుణికి తీవ్ర గాయాలయ్యాయి. బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యం బెలూన్ ఓపెన్ అయినా ముందు సీట్లో ఉన్న సాయి ప్రకాష్‌కు గాయాలయ్యాయి. కారు వెనకాలే మరో కారులో వస్తున్న వీరి మిత్రులు చిన్మయ్, వివేక్‌లు ప్రమాదాన్ని చూసి క్షతగాత్రులను కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అశ్రిత మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. కాగా డిన్నర్లో అభిషేక్, సాయి ప్రకాష్, తరుణి, అశ్రితలు వోడ్కా సేవించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే అభిషేక్ కారును 120 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు తెలిసిందన్నారు. అందువల్లే ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. డ్రైవింగ్ చేసిన అభిషేక్‌కు అర్ధరాత్రి దాటిన తరువాత బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా 10 ఎంఎల్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. నిబంధనలు బేఖాతరు ఆదివారం బోనాలు కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు వైన్స్, బార్లు, పబ్‌లలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ కస్టమర్లకు మద్యం అందించారు. కాగా పబ్ పేరు స్నార్ట్ అని ఉన్నప్పటికీ రుచి ఇండియా రెస్టారెంట్ అండ్ బార్ పేరిట లైసెన్స్ తీసుకున్నారు. పి.మమత పేరున లిక్కర్ లైసెన్స్ ఉంది. పబ్‌లోకి వెళ్లిన వారికి వోడ్కా అమ్మినట్లు ఆధారాలు సేకరించిన గచ్చిబౌలి పోలీసులు స్నార్ట్ పబ్ యజమాని, మేనేజర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 188 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. -
గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు
సాక్షి, గచ్చిబౌలి: పోలీసులు ఓ హోటల్‌పై దాడి చేసి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఆరుగురు విటులతో పాటు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకోగా, నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నారు. గచ్చిబౌలి సబ్ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. యాంటీ ఉమెన్ ట్రాకింగ్ సెల్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం రాత్రి సదరు హోటల్‌పై దాడి చేశారు. విటులు బిజ్యూపాయల్(27), దీపక్‌కుమార్ (25), సంగం కిషోర్‌దాల్(24), నితిన్జాషన్ అలియాస్ ఆరుట్ల నిఖిల్ (31), బంది నారాయణ (38), వెంకటేష్‌గౌడ్(58)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ 32,510 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఒక యువతిని అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, నిర్వాహకులు ప్రభాకర్, సంజయ్, అజయ్ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పప్పులో కాలేసిన టెలీకాలర్, కట్‌చేస్తే న్యూడ్ వీడియో కాల్ వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం -
‘మామ్ సారీ.. ప్లీజ్ గివ్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్’
గచ్చిబౌలి: తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఓ ఇంటర్ విద్యార్థిని 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం..నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ‘మంత్రి సెలస్టియ’ అపార్ట్మెంట్ ఎఫ్ బ్లాక్‌లోని 23వ అంతస్తులో ఇషా రంజన్(17), తల్లి మౌనిక సిన్హా, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటోంది. జూబ్లీహిల్స్‌లో శ్రీచైతన్య కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4.45 గంటలకు బాల్కనీలో చెప్పులు వదిలేసి స్టూల్ ఎక్కి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వాచ్మెన్ గమనించి చెప్పగా తల్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్యా భర్తలు మౌనిక సిన్హా, సికెష్ రంజన్లు 2015లో విడాకులు తీసుకున్నారు. మౌనిక సిన్హా కూతురుతో కలిసి ఇక్కడే ఉంటుండగా తండ్రి అమెరికా వెళ్లిపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఇషా రంజన్ కొద్ది నెలల క్రితం స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని, బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మార్చి 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు మిస్ అవుతున్నానని స్నేహితులకు ఏడు లెటర్లు రాసింది. ఆత్మహత్యకు ముందు తల్లికి ‘మామ్ సారీ..ప్లీజ్ గివ్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్’ అని సూసైడ్ నోట్ రాసింది. స్నేహితులకు రాసిన లేఖలతో పాటు సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇషా రంజన్ తీవ్ర ఒత్తిడికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘ఎలా చావాలి’ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. -
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీస్తున్నారు. మృత దేహాలను స్వాధీనం చెసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు, కారు సిగ్నల్ జంప్ చేయడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
నిర్మానుష్యంగా మారిన సాప్ట్వేర్ జంక్షన్
-
కుబ్రా కుటుంబానికి అండగా ఉంటాం
రాయదుర్గం: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురానికి చెందిన కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. కుబ్రా తల్లిదండ్రులు అబ్దుల్ అజీమ్, షాహిదా, సోదరుడు అబ్దుల్ ఖలీద్‌లను కలిశారు. అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కుబ్రా కుటుంబానికి జీహెచ్ఎంసీ అం డగా ఉంటుంది. వైద్య ఖర్చులన్నీ భరిస్తాం. ఆమె ఆరో గ్య పరిస్థితిని డిప్యూటీ, జోనల్ కమిషనర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సర్జరీ తర్వాత డిశ్చార్జీ అయ్యాక 2 నెలలు పర్యవేక్షించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాం’అని అన్నారు. అందరికీ కృతజ్ఞతలు ‘పెయింటింగ్ చేస్తూ ఎంతో కష్టపడి నా ఇద్దరు పిల్లలను చదివించాను. నా కూతురు ప్రమాదంలో గాయపడటం మమ్మల్ని కలచివేసింది. మేం పేదోళ్లం. చికిత్సకయ్యే వ్యయాన్ని భరించలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం, నగర మేయర్ భరోసా ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని కుబ్రా తండ్రి అన్నారు. ఆదుకునేందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. కుబ్రా తల్లిదండ్రులను కడప జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం పరామర్శించారు. రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో ఇద్దరు నేతలు హైదరాబాద్‌కు చెందిన బీబీజీ కంపెనీ ద్వారా అజీమ్‌కు ఆర్థిక సాయం చేశారు. -
గురుకులంలో దారుణం.. ప్రిన్సిపాల్ భర్త అసభ్య ప్రవర్తన!
సాక్షి, హైదరాబాద్ : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో కామాంధుడు. నగరంలోని శేర్లింగంపల్లి గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ భర్త తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల నీచంగా ప్రవర్తించాడని ఈ నెల 3న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్ 354 ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమోదీని భర్త నాగేశ్వర్ రావు అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాల ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ ప్రమోదీని సస్సెండ్ చేశారు. అయితే ఈ నీచానికి పాల్పడిన నాగేశ్వర్ రావు పరారీలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. -
పాప్.. పాప్.. హుర్రే
వరల్డ్ ఫేమస్ డీజేలు థామ్ జంగ్ కిండ్, ఐదిర్ మఖాఫ్ల పాప్, జాజ్ మ్యూజిక్‌తో శనివారం గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ ఓలలాడింది. ఇక్కడ జరిగిన వీరి లైవ్ కన్సర్ట్ను సంగీత ప్రియులు మస్త్‌గా ఎంజాయ్ చేశారు. ముంబై, హైదరాబాద్ నగరాలు మ్యూజిక్‌ను అమితంగా ప్రేమిస్తాయని జంగ్ అంతకుముందు జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పాడు. పాప్ మ్యూజిక్ అంటే వీరికి ప్రాణమన్నాడు. - గచ్చిబౌలి -
వివాహ్...
-
టెలికాం రంగంలో 20 మిలియన్ల ఉద్యోగాలు
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో 2025 నాటికల్లా 20 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని టీఎస్ఎస్సీ (టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్) సీఈఓ లెఫ్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఎస్కీ(ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)లో ‘ఓకేషనల్ స్కిల్ ట్రైనింగ్ విత్ ఇండస్ట్రీ కనెక్ట్’ శిక్షణ కార్యక్రమంపై ఎస్కీ, టీఎస్ఎస్సీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా కొచర్ మాట్లాడుతూ టెలికాం రంగంలో రూ.80 కోట్ల వ్యయంతో 80 వేల మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. ఎస్కీ డెరైక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీయువకులకు ఉచితంగా శిక్షణ, మెటీరియల్ అందజేస్తామన్నారు. శిక్షణ అనంతరం నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ ధర్మరాజ్, టాటా టెలీ సర్వీసెస్ సీఓఓ రామకృష్ణ, జియోస్టార్ట్ మేనేజింగ్ పార్టనర్ వివేక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎదురులేని హైదరాబాద్
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: నగరాన్ని మరో లీగ్ ముంచెత్తింది. అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ)ను యువత ఆస్వాదించింది. ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ ఇండియా లీగ్ (ఈఎఫ్‌ఎల్‌ఐ)లో భాగంగా శనివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ స్కైకింగ్స్ 27-0తో ముంబై గ్లాడియేటర్స్ జట్టుపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఆట ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ ఆటగాళ్లు ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు అవకాశమివ్వలేదు. దీంతో ముంబై ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఆట ముగించాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ డిఫెండర్స్ 21-6తో బెంగళూరు వార్హాక్స్పై ఘనవిజయం సాధించింది. నగరంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు మ్యాచ్‌లు తిలకిం చేందుకు వచ్చారు. మ్యాచ్‌లు తిలకించిన వారిలో అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్ ఎ.కె.ఖాన్ ఉన్నారు. ఈ లీగ్‌కు ‘సాక్షి’ గ్రూప్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఆటకు ప్రాచుర్యం తెస్తాం అమెరికన్ ఫుట్‌బాల్ (రగ్బీ) ఆటపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈఎఫ్‌ఎల్‌ఐ లీగ్‌ను ప్రారంభించామని లీగ్ సీఈఓ రిచర్డ్ వెలిన్ పేర్కొన్నారు. హైదరాబాద్ స్కైకింగ్స్ యజమాని డాక్టర్ వెంకటేశ్ మువ్వా మాట్లాడుతూ అన్ని టీమ్‌లను ఒక చోటకు తీసుకువచ్చి రగ్బీకి ఆదరణ పెంచేందుకు కృషి చేస్తామన్నారు. లీగ్ బ్రాండ్ అంబాసిడర్ సినీ హీరో సుమంత్ మాట్లాడుతూ మన దేశంలో క్రికెట్ మాదిరిగానే అమెరికన్ ఫుట్‌బాల్‌కూ పాపులారిటీ తెస్తామన్నారు.