
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాద సంఘటన మర్చిపోకముందే మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నడింపల్లి వద్ద ఓ ట్రాక్టర్, టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడ్డవారిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఐతేపల్లి నుంచి దామలచెరువులో నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డవారు ఐతేపల్లి, తిరుపతి చింతలచేను వాసులుగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment