
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హార్స్‌లీ హిల్స్‌లోని మూలమలుపు వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రులను మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివాహర యాత్ర నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాధితులు వెదురుకుప్పం మండలం చౌటపల్లి గ్రామ వాసులని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment