జీవన్‌కుమార్‌రెడ్డి(ఫైల్)
మదనపల్లెటౌన్(చిత్తూరు జిల్లా): మనస్తాపానికి గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. టూటౌన్ సీఐ మురళీక్రిష్ణ, ఎస్‌ఐ చంద్రమోహన్ కథనం మేరకు, కలకడ మండలం కోటగుడిబండకు చెందిన దంపతులు బి.నాగభూషణరెడ్డి, సులోచన 20 ఏళ్ల క్రితం మదనపల్లెకి వచ్చి ఓ కళాశాలలో మెస్ నిర్వహించేవారు. ఏడాది క్రితం కరోనాతో ఇద్దరూ మృతి చెందారు. వీరి ఏకైక కుమారుడు జీవన్‌కుమార్‌రెడ్డి(29), బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే వాడు.
చదవండి: బంధువుతో వివాహేతర సంబంధం.. బాలుడు చూశాడని..
తల్లి దండ్రులు మరణించాక, మదనపల్లెకి వచ్చి వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తూ తండ్రి నిర్వహిస్తున్న మెస్‌ను నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆమె సెల్‌ఫోన్ వారం నుంచి స్విచ్‌ఆఫ్ వస్తోంది. ఇటు తల్లిదండ్రులు లేకపోవడం, అటు ప్రేమ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అతని ఇంటిలోనే శనివారం రాత్రి ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం పొరిగింటి వారు గుర్తించి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ చంద్రమోహన్, ఏఎస్‌ఐ రమణ, సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment