
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ బాబా కోసం సీబీసీఐడీ వేట మొదలెట్టింది. గుణవర్మన్, జయశంకర్ నేతృత్వంలోని బృందం విచారణపై దృష్టి పెట్టింది. శివశంకర్ బాబా నేతృత్వంలో కేలంబాక్కంలో సాగుతున్న సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటున్న హాస్టల్ విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
దీంతో సీబీసీఐడీ అధికారులు పాఠశాల, ఆశ్రమంలో తనిఖీలు, విచారణను ముమ్మరం చేసింది. తాజా పరిణామాలతో పాఠశాలలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు రాజీనామా చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకుని టీసీలు తీసుకుని వెళ్లారు. ఆధ్యాత్మిక పర్యటన, గుండెపోటు అంటూ డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రిలో శివశంకర్ బాబా చికిత్స పొందుతున్నట్టు సమాచారం వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారా..? ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి చెన్నైకు తీసుకొచ్చేందుకు సీబీసీఐడీ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment