
పళ్లిపట్టు(చెన్నై): ప్రేమ వివాహం చేసుకున్న పది నెలలకే ఆ నూతన దంపతులకు ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్కేపేట మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన గోపాల్ కుమారుడు సౌందర్‌రాజన్(22) మైలాడు పారై గ్రామానికి చెందిన పవిత్ర(22)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ నవ దంపతులు ఆర్కేపేట సమీపంలోని ఓ ప్రైవేటు టెక్స్‌టైల్ కేంద్రంలో పని చేస్తున్నారు.
ఐదు నెలల గర్భిణి అయిన పవిత్ర ఆదివారం ఉదయం పనులకు వెళ్లగా భర్త మధ్యాహ్నం ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం వారు ఎంతసేపటికీ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు కిటికీలో చూడగా భార్యభర్తలు ఉరేసుకున్నారు. ఆర్కేపేట పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షోళింగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: దేశంలో ఎక్కడా జరగలేదా.. టీచర్ దెబ్బలకు విద్యార్థి మృతిపై సీఎం సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment