డార్లింగ్‌ పేరుతో యూట్యూబ్‌లో భార్య నగ్న చిత్రాలు | Wife Nude Pictures On Youtube Under Name Darling At Guntur | Sakshi
Sakshi News home page

డార్లింగ్‌ పేరుతో యూట్యూబ్‌లో భార్య నగ్న చిత్రాలు

Published Tue, Nov 24 2020 10:01 AM | Last Updated on Tue, Nov 24 2020 10:01 AM

Wife Nude Pictures On Youtube Under Name Darling At Guntur - Sakshi

మాట్లాడుతున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి , చిత్రంలో ఇతర పోలీసు అధికారులు 

సాక్షి, గుంటూరు: భార్య నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో ఉంచి సొమ్ము చేసుకుంటున్న వికృత భర్తను దిశ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో డార్లింగ్‌ పేరుతో వీడియోలను ఉంచి యువతను ఆకర్షిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా  జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి వివరాలు వెల్లడించారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన బొంతా వంశీకాంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని సౌదీ ఎయిర్‌లైన్స్‌ కార్గో విభాగంలో కొంతకాలం పనిచేశాడు. అక్కడ ఉద్యోగం మానేసి ఆరేళ్ల క్రితం గుంటూరులోని ఏటీ అగ్రహారానికి భార్యతో కలసి మకాం మార్చాడు. కొన్నాళ్లు కొరియర్‌ పాయింట్‌ నిర్వహించి నష్టాలపాలయ్యాడు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు. తమ కొడుకు పనులు లేక ఖాళీగా ఉంటున్నాడని, వ్యాపారం కోసం అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్త మామలు కోడలిని వేధించటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వంశీకాంత్‌ రెడ్డి ఈ ఏడాది జూన్‌లో భార్య నగ్న చిత్రాలను సెల్‌ఫోన్‌లో వీడియాలు తీసి యూట్యూబ్‌లో డార్లింగ్‌ పేరుతో అప్‌లోడు చేశాడు.   (భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..)

రూ.300 చెల్లిస్తే డౌన్‌లోడ్‌.... 
రూ.300 చెల్లిస్తే వాటిని కోరిన వ్యక్తులు చిత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏర్పాటు చేశాడు. గుంటూరు గాంధీనగర్‌కు చెందిన బచ్చు శివశంకర్‌ వీడియోను కొనుగోలు చేసి డౌన్‌లోడు చేసుకున్నాడు. టెక్కలికి చెందిన నిందితుడి స్నేహితుడు సంతోష్‌ను తన భార్యతో సంబంధం పెట్టుకోవాలంటూ వాట్సాప్‌లో చాటింగ్‌ చేశాడు. అప్పటినుంచి బాధితురాలికి సంతోష్‌ ఫోన్‌ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో తన నగ్న చిత్రాలు ఉన్నట్టు తెలుసుకుని ఇదంతా తన భర్త పనేనని ఆమె నిర్ధారించుకుంది. కొద్దిరోజుల క్రితం నేరుగా ఎస్పీని కలసి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విచారించాలని దిశ డీఎస్పీని ఆదేశించారు.     (భార్య నగ్న వీడియోల కేసులో మరో ట్విస్ట్‌)

ఆధారాలు సేకరించి అరెస్ట్‌... 
టెక్నికల్‌ విభాగం సహకారంతో ఆధారాలు సేకరించి వంశీకాంత్‌ రెడ్డిని అరెస్టు  చేశారు. అతనితో పాటు వీడియోలు డౌన్‌లోడు చేసుకున్న శివశంకర్‌ను కూడా అరెస్టు చేశారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా  తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అత్తమామలను కూడా అరెస్టు చేయాల్సి ఉంది. ప్రధాన నిందితుడిపై హిస్టరీ షీట్‌ తెరుస్తామని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభను కనపరచిన డీఎస్పీ కె.సుప్రజ, సిబ్బందికి ఎస్పీ క్యాష్‌ రివార్డులు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement