
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్‌లో) మృతుడు వెంకటేశ్వరరావు (ఫైల్)
నగరం(రేపల్లె)గుంటూరు జిల్లా: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను చంపి ఇంటి ఆవరణలోని పశువుల పాకలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. రేపల్లె రూరల్ సీఐ శివశంకర్ అందించిన వివరాలు.. మండలంలోని పూడివాడ శివారు కాసానివారిపాలెం గ్రామానికి చెందిన కర్రి వెంకటేశ్వరరావు(38), భార్య ఆదిలక్ష్మి మధ్య ఈ నెల 8వ తేదీ రాత్రి గొడవ చోటుచేసుకుంది. భార్య ఆదిలక్ష్మి బలంగా నెట్టడంతో వెంకటేశ్వరరావు గోడకు తగిలి మృతి చెందాడు.
చదవండి: పిన్నితో వివాహేతర సంబంధం.. బాబాయ్‌కి తెలిసి..
దీంతో మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని పశువుల పాకలో గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. కొడుకు కనిపించకపోవడంతో తండ్రి అచ్చియ్య, కోడలు ఆదిలక్ష్మిని నిలదీశాడు. ఇద్దరం గొడవ పడడంతో వెంకటేశ్వరరావు గోడపై పడి చనిపోయాడని పేర్కొంది. భర్త మృతదేహాన్ని మరొకరి సాయంతో పశులపాకలో పూడ్చిపెట్టినట్లు కోడలు అంగీకరించింది. అచ్చియ్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ శివశంకర్, ఎస్‌ఐ ఆర్.స్వామి శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఆదివారం వెలికితీయనున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment