ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మైసూరు(కర్ణాటక): అనుమానిస్తూ, తరచూ గొడవపడుతున్న భర్తను సోదరుడు, బావ సహాయంతో అడ్డు తొలగించుకుందో ఇల్లాలు. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని ఇబ్బాల గ్రామానికి చెందిన కెంపెశెట్టి (35) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య శశికళా, ఆమె సోదరుడు నాగేంద్ర, బావ రమేష్, మరొకరు అరెస్టయ్యారు. వీరికి 12 ఏళ్ల కిందట పెళ్లి కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
మూడేళ్ల కిందట మైసూరుకు వచ్చి కూలీ పనులు చేసేవారు. భార్య గార్మెంట్స్ పనికి వెళ్లేది. అనుమానంతో కెంపెశెట్టి తరచూ రగడ పెట్టుకునేవాడు. దీనిపై భార్యభర్తలు దాడులు చేసుకుని కేసులు పెట్టుకున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన కెంపెశెట్టిపై రాత్రివేళ నలుగురూ కత్తులతో దాడి చేసి చంపేశారు. విజయనగర పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment