
లక్నో : భర్త వివాహేతర సంబంధం విషయం తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ ఏరియాలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీర్జాపూర్, కుట్లుపూర్ గ్రామానికి చెందిన పాన్ దేవీ అనే మహిళ భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ( మైనర్‌తో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్ )
ఆ తర్వాత దగ్గరిలోని రామ్‌గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధం కారణంగా అల్లుడు తమ కూతుర్ని చిత్రహింసలు పెట్టేవాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు దేవీ భర్త హరిభరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment