
రాజోలు(తూర్పుగోదావరి): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకున్న ప్రియుడు తరువాత నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కృషమాచారి కథనం ప్రకారం.. రాజోలుకు చెందిన కుసుమ శ్రీలత (21), మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన నేల మనోజ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరికీ వచ్చే నెలలో పెళ్లి చేయాలని పెద్దలు నిరయించారు.
ఈ నెల 12న శ్రీలతతో మనోజ్ వాట్సాప్ చాటింగ్ చేస్తుండగా.. మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను చనిపోతానంటూ మనోజ్‌కు శ్రీలత మెసేజ్ చేసింది. ఉరి వేసుకుంటున్న ఫొటోలను మనోజ్‌కు వాట్సాప్ చేసి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై శ్రీలత తండ్రి సత్యనారాయణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. శ్రీలత మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment