
హత్యకుగురైన భాస్కర్‌రెడ్డి
బ్రహ్మంగారిమఠం (వైఎస్సార్ జిల్లా): మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండ లం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్‌రెడ్డి (52)ని దారుణంగా హత్యచేశారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేరకు.. ముడుమాల, పలుగురాళ్లపల్లె పంచా యతీల సర్పంచులుగా వైఎస్సార్‌సీపీ అభిమా నులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకో లేని పలు గురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు మీసాల దుగ్గిరెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ముడుమాల, జౌకుపల్లె గ్రామాల మధ్యలో భాస్కర్‌రెడ్డితో ఘర్షణకు దిగారు. ‘నువ్వు రాజీచేస్తావా..’ అంటూ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. భాస్క ర్‌రెడ్డి కుప్పకూలిపోవడంతో వారు పారిపో యారు. ఈ విషయం తెలిసి భాస్కర్‌రెడ్డి కుటుం బసభ్యులు అక్కడికి చేరుకుని 108 వాహనంలో అతడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారిమఠం పోలీసులు.. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ
ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment