న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌ను పొడిగించారు. మరోవారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలో లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయాన్ని కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్నలాక్‌డౌన్ ఈ నెల17వ తేదీతో ముగియనుండగా.. మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు పొడగించారు. ఢిల్లీలో శనివారం 11% పాజిటివిటీ రేటుతో 6,430 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మొదట ఏప్రిల్ 19న లాక్‌డౌన్ అమలులోకి రాగా.. పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఇప్పటివరకు నాలుగుసార్లు లాక్‌డౌన్ పొడగించారు.
ఇక దేశంలో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 18,32,950 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 4,077 మంది మృతి చెందగా, మొత్తం మరణాలు 2,70,284కి చేరుకున్నాయి.
(చదవండి: ప్రధానిని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు)
Comments
Please login to add a commentAdd a comment