
శిథిలావస్థకు అన్నంపల్లి అక్విడెక్టు
అన్నంపల్లి పాత అక్విడెక్టు శిథిలావస్థకు చేరింది. దీనిని 1929 సంవత్సరంలో నిర్మించారు. నాటి నుంచి ఇది ఐలెండ్‌కు తాగు, సాగునీరు అందిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునీకరణ నిధులు కేటాయించడంతో 2015లో కొత్త అక్విడెక్టు వినియోగంలోకి వచ్చిన తరువాత పాత అక్విడెక్టును గాలికి వదిలేశారు. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చాలనే డిమాండ్ ఉంది. రంగులు వేసి, రైలింగ్ నిర్మాణంతోపాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, అక్విడెక్టు తొట్టిలో బోటింగ్ సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదన ఉంది.
Comments
Please login to add a commentAdd a comment