
ఆర్టీసీ డ్రైవర్లకు సత్కారం
అమలాపురం రూరల్: ఆర్డీసీ డ్రైవర్లు ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తతతో డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోనసీమ జిల్లా ప్రజారవాణాధికారి డి. శ్రీనివాసరావు సూచించారు. ఆర్టీసీలో రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా అమలాపురం డిపో గ్యారేజ్‌లో శుక్రవారం జరిగిన ముగింపు సభలో జిల్లా ప్రజారవాణాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీలో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించామన్నారు. జిల్లా స్థాయిలో ముగ్గురు, డిపో స్థాయిలో 12 మంది యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. రోటరీ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ సాయంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అమలాపురం, రావులపాలెం, రాజోలు డిపోల నుండి 62 మంది రక్తదానం చేసారు. వీరబాబు, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం డిపో మేనేజర్లు చల్లా సత్యనారాయణమూర్తి, ఎఎం రమణ, ధనమ్మ, భాస్కర్‌రావు, ఆర్టీసి అధికారులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి ఆదాయం రూ.47,89,784
సఖినేటిపల్లి: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి భక్తుల నుంచి విరాళాల రూపంలో వివిధ హుండీల ద్వారా మొత్తం రూ.47,89,784 ఆదాయం చేకూరింది. గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ 17 రోజులకు హుండీల లెక్కించారు. శుక్రవారం అంతర్వేది ఆలయంలో ఎండోమెంట్స్ డీసీ డీఎల్‌వీ రమేష్‌బాబు, అమలాపురం ఎండోమెంట్స్ ఇన్‌స్పెక్టర్ జే రామలింగేశ్వరరావు సమక్షంలో హుండీలు తెరచి లెక్కించగా స్వామివారికి పై ఆదాయం వచ్చింది. మెయిన్ హుండీల ద్వారా రూ.46,76,268, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.86,241, అన్నదానం హుండీల ద్వారా రూ.27,275 వచ్చినట్టు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. 8.500 గ్రాముల బంగారం, 104.370 గ్రాముల వెండి వస్తువులు వచ్చినట్టు చెప్పారు. లక్ష్మీనృసింహుని దేవస్థానంకు అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయ హుండీ ద్వారా రూ.47,587 ఆదాయం వచ్చిందన్నారు. చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాలరాజా బహద్దూర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పీఈటీలకు డీఈవో అభినందన
అమలాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్ కం స్పోర్ట్స్ మీట్‌లో పలు కీడల్లో ప్రతిభ చాటి విజేతలైన పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు జిల్లాకు పేరు తెచ్చారని డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా అన్నారు. ఆ స్పోర్ట్ మీట్‌లో విజేతలైన పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు స్థానిక నల్ల వంతెన వద్ద గల డీఈవో నివాసంలో డీఈవో బాషాను కలిసి తాము సాధించిన పతకాలు, బహుమతులను ఆయనకు చూపించారు. విజేతలను డీఈవో అభినందించి సత్కరించారు. స్పోర్ట్స్ మీట్‌లో విజేతలైన ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రవి, మధు, సురేష్, సతీష్, ఐశ్వర్య, నాగదుర్గ, సూర్యకుమారి, నరసింహరావులతోపాటు పీఈటీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు మూర్తి, ప్రసాద్, రామారావు, ఈశ్వరరావు, గణేష్, ముసలయ్యలు డీఈవోను కలిసిన వారిలో ఉన్నారు. డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామ్స్ బోర్డు సెక్రటరీ హనుమంతరావు సైతం విజేతలైన ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలను అభినందించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్ బాల్ క్రీడల్లో జిల్లాకు సంబంధించి పై ఎనిమిది మంది పీడీలు, పీఈటీలు విజేతలై పతకాలు, షీల్డ్‌లు సాఽధించారు.

ఆర్టీసీ డ్రైవర్లకు సత్కారం

ఆర్టీసీ డ్రైవర్లకు సత్కారం
Comments
Please login to add a commentAdd a comment