
ఎన్‌ఎంఎంఎస్‌కు 11 మంది ఎంపిక
అల్లవరం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు అల్లవరం మండలం నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఎంఈఓ కిరణ్‌బాబు శుక్రవారం తెలిపారు. కొమరగిరిపట్నం ఉన్నత పాఠశాల నుంచి బండారు ప్రదీప్, చల్లపల్లి తేజ, యర్రంశెట్టి వాణి మహాలక్ష్మీ, నార్ని మౌనిక ప్రియలక్ష్మి, నాగ ప్రైస్సీ, పితాని శ్రీవల్లి, యాళ్ల చైత్ర, విజ్ఞాన లలితనాగ భాగ్యశ్రీ, ఓలేటి మాధవి కారుణ్య, ఓడలరేవు ఉన్నత పాఠశాల నుంచి దండుప్రోలు స్వాతి, అల్లవరం ఉన్నత పాఠశాల నుంచి పెస్సింగు రాజ రాజేశ్వరీ ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికయ్యారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లపాటు రూ.12 వేలు చొప్పున స్కాలర్‌షిప్ పొందుతారన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, కేఎస్‌ఆర్ మూర్తి, ఎన్.వెంకటేశ్వరరావు, విద్యార్థులను ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతమి, ఎంఈఓలు కిరణ్‌బాబు, ఏడుకొండలు అభిందించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన
వారు దరఖాస్తు చేసుకోండి
అమలాపురం రూరల్ కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్ల లోపు బాలబాలికలు పీఎం కేర్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ ఆర్.మహేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 2020 మార్చి 11 నుంచి 2023 మే5 మధ్య కాలంలో కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయినవారు మాత్రమే అర్హులన్నారు. ఇంతవరకు నమోదు చేసుకోని వారు వెంటనే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment