
ఆగిన పర్యాటకాభివృద్ధి
రాజోలు దీవికి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన పి.గన్నవరం అక్విడెక్టును 1845లో నిర్మించారు. ఇది 2000వ సంవత్సరం వరకు సేవలందించింది. తరువాత కొత్త అక్విడెక్టు నిర్మాణం అందుబాటులోకి రావడంతో దీని సేవలు ఆగిపోయాయి. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రూ.10 లక్షలతో అక్విడెక్టుపై పర్యాటకులు కూర్చునేందుకు ఆర్చ్‌లు, బెంచ్‌ల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాల వల్ల అక్విడెక్టుకు అనుబంధంగా నిర్మించిన వంతెనపై వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడున్న కొత్త అక్విడెక్టు కమ్ రోడ్డు మీద భారీ ప్రమాదాలు జరిగితే ప్రత్యామ్నాయంగా పాత వంతెనను వినియోగించాల్సి ఉన్నందున నిర్మాణాలు నిలుపుదల చేశారు. తరువాత పలు సందర్భాలలో పర్యాటక ప్రతిపాదనలు వచ్చినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి.

ఆగిన పర్యాటకాభివృద్ధి
Comments
Please login to add a commentAdd a comment