
దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దొంగ నోట్ల మారకం ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.6 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆ వివరాలను రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. బిక్కవోలు మండలం అంబడిపేటకు చెందిన వ్యాన్ మెకానిక్ పల్లి రాంబాబును ఈ నెల 1న కోనసీమ జిల్లా బాలాంతరం గ్రామ వాసి చిట్టూరి హరిబాబు కలిశాడు. తన వ్యాన్‌ను రిపేర్ చేయించాలని కోరాడు. దీంతో హరిబాబు తన స్నేహితుడు మెకానిక్ ఆకుల పవన్‌తో కలసి వ్యాన్‌ను గ్యారేజ్‌కు తీసుకువెళ్లారు. వ్యాన్ చెక్ చేసి రూ.పది వేలు ఖర్చు అవుతుందని తెలపడంతో హరిబాబు అందుకు అంగీకరించి అడ్వాన్స్‌గా నాలుగు ఐదు వందల నోట్లు ఇచ్చాడు. హరిబాబు వ్యాన్ స్పేర్ పార్ట్‌లు కొనుగోలు నిమిత్తం దుకాణానికి వెళ్లి ఆ డబ్బులు ఇవ్వగా రూ.500 నోట్లు నకిలీవని తెలియడంతో బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ పి.విద్య ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. ఈనెల 7వ తేదీన దొంగ నోట్లు ఇచ్చిన చిట్టూరి హరిబాబును, అతడి స్నేహితులు కాకినాడ జిల్లా కాజులూరు గ్రామానికి చెందిన శీలం కేదారేశ్వర పరిపూర్ణ శ్రీనివాస్‌ను, దుగ్గుదూరు గ్రామానికి చెందిన చీకట్ల ఏడుకొండలు, పాత గుంటూరుకు చెందిన ధోనేపూడి మధులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 756 నకిలీ రూ.500 నోట్లు స్వాధీన చేసుకున్నారు. వారిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపించారు. వారిచ్చిన సమాచారం మేరకు ఈ నెల 14న ప్రధాన నిందితుడు పాత గుంటూరు బాలాజీ నగర్‌కు చెందిన కర్రి మణికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నకిలీ నోట్లు ప్రింటింగ్‌కు ఉపయోగిస్తున్న కంప్యూటర్, ప్రింటర్ సామగ్రి, నకిలీ నోట్లు మారకానికి ఉపయోగిస్తున్న కారు, నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు నిందితుల నుంచి మొత్తం రూ.1.6 కోట్ల నకిలీ నోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు దొంగ నోట్లు తయారీ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో అంగీకరించారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేసి, చాకచక్యంగా త్వరితగతిన ఛేదించిన అనపర్తి సీఐ వీఎల్‌వీ కె.సుమంత్, బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్, అనపర్తి ఎస్సై వి.శ్రీను, రంగంపేట ఎస్సై టి.కృష్ణసాయి, సిబ్బంది ఏవీ సత్యప్రసాద్, పి.రఘు, కానిస్టేబుళ్లు ఎం.వీరబాబు, కె.తిరుమల యాదవ్, వి.త్రిమూర్తులు, వి.శివ, వి.రవికుమార్, వి.వరప్రసాద్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఫ ఐదుగురు నిందితుల అరెస్ట్
ఫ రూ.1.6 కోట్ల
నకిలీ నోట్ల స్వాధీనం

దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు
Comments
Please login to add a commentAdd a comment