
ఆటహాసంగా..
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడా స్ఫూర్తితో హాకీ పోటీల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఆల్‌ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పురుషులు, మహిళల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు తొలిసారి రాష్ట్రం అతిథ్యం ఇస్తుండడంతో ప్రారంభ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దీనికి డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, ఒలింపియన్లు ముకేష్‌కుమార్, మనోహర్ రియాజ్, జేసీ రాహుల్ మీనా, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు కన్వీనర్ రాజ్‌కుమార్ హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను జేసీ రాహుల్ మీనా, సివిల్ సర్వీసెస్ జెండాను ఐఏఎస్ భావన, జిల్లా జెండాను డీఆర్‌ఓ వెంకట్రావు ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారుల కవాతును కలెక్టర్ తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. పోటీలను కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు. పోటీల ప్రారంభ సూచికంగా బెలూన్లు ఎగుర వేశారు. ఏపీకి చెందిన క్రీడాకారిణి భార్గవి క్రీడా ప్రతిజ్ఞను చేయించారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతి క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ చూపాలన్నారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ముందుగా సివిల్ సర్వీసెస్ బోర్డు టోర్నీని ఏపీకి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కాకినాడ నగరం చాలా చిన్న నగరమైన సముద్రం, అడవులు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రసిద్ధి అన్నారు. క్రీడాకారులు వాటిని తిలకించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని, వాటిని చూసి మంచి జ్ఞాపకాలతో ఈ టోర్నీ నుంచి వెళ్లాలన్నారు. టోర్నీ నిర్వహణకు సహకరించిన అపోలో హాస్పిటల్స్, కాకినాడ సీపోర్ట్సు, జిల్లా రైస్ మిల్లర్స్ సంఘం, వివిధ ఇండస్ట్రీస్ ప్రతినిధులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం త్రిపుల్ ఒలింపియన్లను కలెక్టర్ సత్కరించారు.
ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యం
పోటీల ప్రారంభం సందర్భంగా సెట్రాజ్ ఆధ్వర్యంలో చింతూరు గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యం, సిలంబం ఫైన్ ఆర్ట్స్, కళాంజలి ఆర్కెస్ట్రావారి రాక్ బ్యాండ్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్, ఎస్పీలు ఈ నృత్యాలను తిలకించి కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, రాష్ట్ర పీఈటీ సంఘ అధ్యక్షుడు జార్జి, జిల్లా హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు రవిచంద్ర పాల్గొన్నారు.
తొలి రోజు విజేతలు
తొలిరోజు హర్యానా– హిమాచల్ ప్రదేశ్‌కు జరిగిన మ్యాచ్‌లో హర్యానా 14–0 స్కోర్‌తో విజయం సాధించింది. కర్ణాటక–పుదుచ్చేరి మధ్య జరిగిన మ్యాచ్‌లో పుదుచ్చేరి 10–1 స్కోర్‌తో విజయకేతనం ఎగురవేసింది.
ఫ ఆల్‌ఇండియా సివిల్ సర్వీసెస్
హాకీ పోటీలు ప్రారంభం
ఫ వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారుల రాక

ఆటహాసంగా..

ఆటహాసంగా..
Comments
Please login to add a commentAdd a comment